![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద హిమజ ఫుల్ పాపులర్. బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. సిల్వర్ స్క్రీన్ మీద ఈమె కొన్ని సినిమాల్లో నటించింది. నేను శైలజ, ధ్రువ, శతమానం భవతి, స్పైడర్, ఉన్నది ఒకటే జిందగీ, వినయ విధేయ రామ, రచయిత వంటి చిత్రాల్లో చేసింది. అలాంటి హిమజ రీసెంట్ ఫామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కి వచ్చింది. అందులో తానూ ఒక విషయంలో ఇబ్బంది పడినట్లు చెప్పింది.
"నాకు రెంట్ హౌసెస్ లో ఉండడం సరదా. ఒక ఇంట్లో బోర్ కొడితే ఇంకో ఇంటికి షిఫ్ట్ ఐపోతాను. ఆ సరదాతో సొంత ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచన అప్పట్లో ఉండేది కాదు. రేపు గృహప్రవేశం. అడ్వాన్స్ ఇచ్చాను. రెండో రోజు తెల్లవారుజామునే గృహప్రవేశం కోసం ముందు రోజు అన్ని పూజా సామాన్లు తెచ్చి వుంచుకున్నా. ఇంతలో నాకు ఫోన్ వచ్చింది. అమ్మా కమ్యూనిటీలో సినిమా వాళ్లకు ఇవ్వొద్దని చెప్పారమ్మా . సారీ మీ అడ్వాన్స్ మీకు వెనక్కు పంపిస్తున్నా తీసుకోండి అని. గుండె భారమైపోయింది. సరే ఇలా కాదు అని చెప్పి సొంత ఇల్లు కావాలని ఆ రోజు డిసైడ్ అయ్యాను. మీరు నమ్ముతారో లేదో 2 వారాలు నైట్ టైం హరి హర వీర మల్లు షూటింగ్ , అదే డేట్స్ మార్నింగ్ వరుడు కావలెను షూటింగ్, ఒకే డేట్స్ లో ఎవొచ్చినా ఒప్పుకున్నాను. తర్వాత మన శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ మీకు గుర్తు ఉంటె గనక కొన్ని వారాల పాటు ఎక్కడ చూసినా నేనే కనిపించాను. థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్. మీరు ఆ రోజు అలా అన్నందుకే నేను ఇల్లు తీసుకున్నాను. అందుకే ఇంకా ఎక్కువ కష్టపడి సెటిల్ అయ్యాను. " అంటూ హిమజ తన కష్టాలను చెప్పుకొచ్చింది. అలా అప్పట్లో హిమజ కొత్త ఇంటి గృహప్రవేశం వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఒక కార్ కూడా కొనుక్కుంది. తన సొంత ఇంటి కోసం భూమి పూజ నుంచి మొదలుకుని అన్నీ వీడియోస్ చేసి చూపించింది.
![]() |
![]() |